English   

సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి నో చెప్పిన విజయ్..

AR Murugadoss
2020-10-30 11:07:56

తమిళ సూపర్ స్టార్ విజయ్ కు తెలుగులో కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు తెలుగులో కూడా విజయం సాధిస్తున్నాయి. తుపాకీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఆ తర్వాత అదిరింది సర్కార్, విజిల్ సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో విజయ్ కి దాదాపు 10 కోట్ల మార్కెట్ ఉంది. ఆయన తాజాగా నటిస్తున్న మాస్టర్ సినిమా కూడా భారీ రేటుకు అమ్ముడైంది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్ మరోసారి సీనియర్ దర్శకుడు మురుగదాస్ తో సినిమా చేయాలనుకున్నాడు. తుపాకీ సినిమాకు సీక్వెల్ గా ఇది ఉండబోతోందని ప్రచారం జరిగింది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలని సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు విజయ్ తప్పుకున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. 

మురుగదాస్ ఈ మధ్య పెద్దగా ఫామ్ లో లేడు. రజనీకాంత్ దర్బార్, మహేష్ బాబు స్పైడర్ డిజాస్టర్ అయ్యాయి. విజయ్ తో తెరకెక్కించిన సర్కార్ పర్వాలేదనిపించింది. అప్పుడు విజయ్ కు ఉన్న క్రేజ్ తో సినిమా ఆడేసింది. ఇప్పుడు మురుగుదాస్ డైలమాలో పడిపోయింది. ఒకప్పుడు వరుస విజయాలతో అగ్ర దర్శకుడిగా ఉన్న ఈయన ఇప్పుడు మాత్రం ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నాడు. తనకు బాగా కలిసి కలిసొచ్చిన విజయ్ తోనే మరో సినిమా చేయాలనుకున్నా కూడా తుపాకీ సీక్వెల్ కథ హీరో గారికి అంత నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తనకు తుపాకి, కత్తి, సర్కార్ లాంటి హిట్స్ ఇచ్చిన మురుగుదాస్ ను విజయ్ కాదనుకోవడం మాత్రం నిజంగానే సంచలనం. 

More Related Stories