English   

మోనాల్ పై మళ్ళీ నోరు జారిన అభి

Abhi
2020-10-30 11:33:40

బిగ్ బాస్ సీజన్-4 రేటింగ్ మొదట్లో గట్టిగానే వచ్చినప్పటికీ ఇప్పుడు డీలా పడినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ మూడు సీజన్లు మంచి రేటింగ్ తో నడిచినప్పటికి సీజన్-4 మాత్రం రేటింగ్ పడిపోయింది. దీనికి కారణం టీవీ9 దేవి మరియు కుమార్ సాయిది ఫేక్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అంతే కాకుండా మోనాల్ ను సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేషన్ చేసింది కూడా హౌస్ లో మోనాల్ లవ్ ట్రాక్ నడిపిస్తుందనే అని అంటున్నారు. మోనాల్ మొదట్లో హౌస్ లో అఖిల్ మరియు మోనాల్ లతో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిపింది. ఈ క్రమంలో మోనాల్ కి అభిజిత్ కు మధ్య విబేధాలు రావడంతో గత వారం రోజులుగా ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. 

ఇక తాజాగా మోనాల్ పై అభిజిత్ బాడీ షేమింగ్ కామెంట్లు చేసాడు. మోనాల్ కాళ్ళు దూరంగా వేస్తూ ఒంటెలా నడుస్తుందని...అలా నడవడం చూస్తే మజా వస్తుందని అభిజిత్ తన ఫ్రెండ్ నోయెల్ తో చెప్పాడు. దాంతో నోయల్ అంత భాగా అబ్సర్వ్ చేస్తున్నావా అంటూ సెటైర్ వేసాడు. తరవాత నువ్ దుబాయ్ షేక్ లా కూర్చున్నావ్ అంటూ మరో కామెంట్ చేసాడు. ఇక అభిజిత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. అప్పట్లో అఖిల్ ఎడ్యుకేషన్ పై కూడా వ్యాఖ్యలు చేసి బుక్ అయ్యాడు. అంతే కాకుండా కుమార్ సాయిని లూస్ అని పిలిచి నోరు జారాడు. దాంతో నాగార్జున సైతం అభిజిత్ కు వార్నింగ్ ఇచ్చాడు. భయట కూడా అభిజిత్ కు నోటి దూల ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సారి మోనాల్ పై చేసిన కామెంట్లు కూడా అభిజిత్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

More Related Stories