English   

అడవుల్లోకి అల్లు అర్జున్..నెల రోజుల పాటు అక్కడే

Allu Arjun Pushpa
2020-10-31 11:58:46

క్రేజీ దర్శకుడు సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ కథ నేపథ్యంలో "పుష్ప"అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ పూర్తి కాగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. దాంతో తిరిగి షూటింగ్ ను వచ్చే నెల 6 నుండి తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే షూటింగ్ కోసం అల్లు అర్జున్ అడవిలోకి వెళ్లనున్నారు. హైదరాబాద్ సమీపంలోని మారేడ్ పల్లి అడవుల్లో ఈ షూటింగ్ కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం అల్లు అర్జున్, రష్మిక లు చిత్తూరు యాసను నేర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక రంగస్థలం లాంటి భారీ హిట్ తరవాత సుకుమార్ ఈ సినిమా చేస్తుండగా..అల వైకుంఠ పురం హిట్ తరవాత బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అభిమానులకు ,ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా..లేదా? అన్నది చూడాలి.

More Related Stories