English   

పవన్ కళ్యాణ్ కు నో చెప్పిన రౌడీ బేబీ

Sai Pallavi
2020-10-31 18:54:56

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు పలు క్రేజీ ప్రాజక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్టు కు ఒకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో సూర్య దేవర నగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 3ఏ సినిమాను అనౌన్స్ చేస్తూ " కింగ్ ఆఫ్ యాటిట్యూడ్..తెలుగు సినిమా      ఫెవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ తో రాబోతున్నారు" అంటూ పేర్కొన్నారు. కాగా ఇదికూడా రీమేక్ సినిమా అని "అయ్యప్పనుమ్ కోషియం" అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తెలుగులో "బిల్లా రంగ" అనే టైటిల్ ను పరిషిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి రౌడీ బేబీ సాయి పల్లవిని సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించిందట. దానికి కారణం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భార్య క్యారెక్టర్ కు తక్కువ సమయం ఉంటుందట. అంతే కాకుండా ఈ ఐనిమా ముఖ్యంగా ఇద్దరు  హీరోల చుట్టూ తిరుగుతుందట. ఇక తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సాయి పల్లవి తన నటనకు ప్రాధాన్యం తక్కువ ఉండటంతోనే తిరస్కరించిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి హీరోయిన్లు ఈగ బడుతుంటే సాయి పల్లవి తిరస్కరించడం ఏమిటి అని కూడా సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

More Related Stories