English   

నాన్న ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు..యశ్

KGF Superstar Yash
2020-11-03 07:43:17

కన్నడ స్టార్ హీరో యశ్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. యశ్ తండ్రి ఆర్టీసీ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తుండగా తల్లి హౌస్ వైఫ్. ఎవరైనా పిల్లలు చిన్నప్పుడు నువ్వు ఏం కావలనుకుంటున్నావ్ అని అడిగితే డాక్టర్ ఓ ఇంజనీర్ ఓ కావాలని చెబుతారు. కానీ యశ్ మాత్రం స్కూల్ ఏజ్ నుండే హీరో అవుతానని చెప్పేవాడట. అంటే యశ్ కి నటనపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నటనపై ఆసక్తి ఉన్న యశ్ ఇంట్లో నుండి 300 రూపాయలు తీసుకుని పారిపోయి బెంగుళూర్ చేరుకున్నాడు. అక్కడ ఒక థియేటర్ ట్రూప్ లిప్ జాయిన్ అయ్యాడు. ఆ ట్రూప్ వాళ్ళకి యశ్ సిగరెట్లు, మందు అందిచేవాడు. అయతే ఒకరోజు అందులో ఒక సభ్యుడు రాకపోవడంతో యశ్ కు అవకాశం వచ్చింది. అందులో భాగా నటించడంతో ఆ తరవాత కొన్ని నాటకాల్లో నటించే అవకాశం లభించింది. 

అనంతరం కొన్ని సీరియల్స్ లో కూడా యశ్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2008 లో యశ్ మొదటి సినిమా మొగ్గిన మనసులు లో నటించాడు. ఈ సినిమాకు అతడికి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తరవాత రాఖీ అనే అనే సినిమాలో నటించాడు. యశ్ నటన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు నచ్చడంతో "కేజీఎఫ్" సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక కేజీఎఫ్ సినిమా తరువాత యశ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని భాషల్లో ఈ సినిమా కు హిట్ టాక్ వచ్చింది. దాంతో ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నారు. ఇక యశ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినప్పటికి అతడి తండ్రి ఇప్పటికీ డ్రైవర్ ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి కూడా సాధారణ జీవనమే గడుపుతుంది. వారికి సింపుల్ గా జీవించడమే ఇష్టమని యశ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

More Related Stories