English   

మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా

 Fatima Sana Shaikh
2020-11-03 07:50:45

దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన నటి ఫాతిమా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఫాతిమా వెల్లడించింది. ఇమ్రాన్ హష్మితో "ఆశిక్ బానాయ" పాటలో ఫాతిమా రొమాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత ఫాతిమాకు ఎలాంటి ఛాన్స్ లు రాలేదు. అంతే కాకుండా హాట్ గా ఉండే ఫాతిమా ఫాట్ గా మారిపోయింది. దాంతో ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక చాలా కాలం తరువాత దంగల్ సినిమాలో ఫాతిమా అమీర్ ఖాన్ కూతురు గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫాతిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి పేర్కొంది. 

ఫాతిమా మాట్లాడుతూ..."చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టినప్పటికి హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడినట్టు తెలిపింది. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లినా అవమానాలు ఎదురయ్యేవని తెలిపింది. కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు ఇస్తామని అనేవారని భాధపడింది. ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ ఎలానో ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ అలా అని అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. తనకు మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. కానీ అలాంటివి మహిళలు ఎక్కడ చెప్పుకోలేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మహిళలు చదువుకుంటున్నారు. ఏమైనా జరిగితే ఓపెన్ గా భయటకు వచ్చి చెబుతున్నారు" అంటూ ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.

More Related Stories