English   

ఆర్జీవీ కి షాక్ ఇచ్చిన దిశ నిందితుల కుటుంబసభ్యులు

Disha Encounter
2020-11-03 08:07:05

ఆర్జీవీ తీసిన దిశ ఎన్కౌంటర్ సినిమా రిలీజ్ ను నిలిపివేయాలని ఇప్పటికే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దిశ సినిమాపై మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ను దిశ నిందితుల కుటుంబసభ్యులు ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్  ఆరీఫ్ కుటుంబ సభ్యులు హైకోర్టుకు చేరుకున్నారు. ఈ చిత్రం లో తమ వాళ్ళను విలన్స్ గా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాని నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దిశ ఎన్కౌంటర్ సినిమా వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛ కు భంగం కలుగుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోయిన వారిని ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్ కు తెలిపిన కుటుంబ సభ్యులు. సుప్రీంకోర్టు నియమించిన కమీషన్ కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదు చేశారు. వెంటనే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కమిషన్ ను కుటుంబ సభ్యులు కోరారు. ఇప్పటికే ఆర్జీవీ తెరకెక్కించిన మర్డర్ సినిమాకు సైతం బ్రేకులు పడగా ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ సైతం కోర్ట్ కేసుల్లో చిక్కుకుంది.

More Related Stories