English   

పులుల అభయారణ్యంలో చైసామ్ సందడి

Samantha
2020-11-03 08:29:43

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చంద్రపూర్ లో గల తాడోబా పులుల అభయరణ్యం లో నాగచైతన్య సతిమనితో కలిసి సందడి చేసాడు.  చైతన్య-సమంత కుటుంబంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. చిమూర్ మార్గంలోని ప్రధాన ద్వారం కొలరాగుండా ప్రవేశించి అక్కడ ఉన్న వెదురు వసతి గృహంలో బస చేశారు. అక్కడ చైతూ-సామ్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయంత్రం జిప్సి లో తిరుగుతూ సమంత చైతూ లు పులుల తో పాటు ఇతర జంతువులను చూసినట్టు అటవీశాఖ అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన సమంత-చైతన్య లు ఒకరి మాయలో ఒకరు పడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి కుటుంబ సభ్యుల మధ్యలో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాటి నుండి చైతన్య సమంతలు ఏ కార్యక్రమం జరిగినా కలిసి హాజరవుతారు. దాంతో సోషల్ మీడియాలో చై సామ్ ముచ్చటైన జంట అంటూ నెటిజన్లు వారి ఫోటోలను వైరల్ చేస్తుంటారు. ఇక పెళ్లి తరవాత కూడా ఈ జంట సినిమాలతో బిజీగా వుంది. ప్రస్తుతం సమంత ఎక్కువగా యాక్టింగ్ కు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతే కాకుండా ఇద్దరూ కలిసి సినిమాలు, యాడ్స్ చేస్తూ గట్టిగానే సంపాదిస్తున్నారు.

More Related Stories