English   

రామ్ వర్క్ ఫ్రమ్ హోం..లుక్ అదుర్స్

Ram Pothineni
2020-11-03 08:48:16

రామ్ పోతేనేని అనేకంటే రాపో అంటేనే అభిమానులకు ఎంతగానో నచ్చుతుంది.రాపో ఇస్మార్ట్ శంకర్ విజయంతో తన స్టామినాని బాక్స్ ఆఫీస్ వద్దే కాకుండా నటనతో జనాల హృదయాలని కూడా గెలుచుకున్నాడు. రామ్ నటించిన "రెడ్" సినిమాలో  ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ స్వరాలు అందిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా రెడ్ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే అన్ని "ott" సంస్థలు చిత్ర యూనిట్ ను సంప్రదించినప్పటికి నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో సంక్రాంతికి థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా రామ్ తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు షర్ట్, నలుపు పాంట్ తో ఫార్మల్ లుక్ లో రామ్ ఆకట్టుకున్నాడు. ఈ ఫోటో కు రామ్ "నేను పనిలో ఉన్నాను"  " నేను ఇంట్లో ఉన్నాను" ఒక ఫార్ముల గో ఈజీ, #WFH  LOOK LOVE...#RAPO అనే కాప్షన్ తో సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

More Related Stories