English   

హిమజ జ ఫస్ట్ లుక్ విడుదల

 Himaja
2020-11-03 09:05:14

నటి హిమజ యాంకరింగ్ చేస్తూ సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించినప్పటికీ పెద్దగా పరిచయం లేని పేరు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మాత్రం తెగ పాపులర్ అయింది. బిగ్ బాస్ లోకి రాకముందు హిమజ "ఒకటే జిందగి, నేను శైలజ, మహానుభావుడు" లాంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని అలరించడం జరిగింది. ఇక పాపులారిటీ పెరిగిన హిమాజ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య" సినిమాలో కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మొదటి సారిగా హిమాజ ప్రధాన పాత్రలో నటించిన "జ" ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ...ఈ సినిమా తన కెరియర్ లో మంచి విజయం సాధిస్తుందని అభిప్రాయ పడింది. ఈ సినిమాను జై దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో గోవర్ధన్ రెడ్డి కాందుకూరి నిర్ముస్తుండగా... సైది రెడ్డి చిట్టెపు దర్శకత్వం వశిస్తున్నాడు. వేంగి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ ప్రధాన పాత్రలో సినిమా వస్తుండటంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హిమజ కు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

More Related Stories