English   

మెగా మేనల్లుడితో బండ్ల గణేష్ సినిమా

 Sai Dharam Tej
2020-11-03 09:30:23

బండ్ల గణేష్ నటుడు, ప్రొడ్యూసర్ గా కంటే 2018 ఎలక్షన్స్ టైం లో వార్తల్లో నిలిచి ఫేమస్ అయ్యాడు. నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల  "ఆంజనేయులు" సినిమాతో ప్రొడ్యూసర్ గా మారారు. ఆతరువాత పవన్ కళ్యాణ్ తో "తీన్మార్" సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో నష్టాలపాలైన గణేష్ కు పవన్ కళ్యాణ్ మరో అవకాశం ఇవ్వడంతో "గబ్బర్ సింగ్" సినిమాతో ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ ఇటీవలే "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా మరోసారి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. మరోవైపు బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీలో ముగ్గురు హీరోలకు అడ్వాన్సులు ఇచినట్టు వార్తలు వస్తున్నాయి. మెగా మేనల్లుడు "సాయిధరమ్ తేజ్" తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్  " సొలొబ్రతుకే సోబెటారు" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆతరువాత సాయి "దేవాకట్ట"తో కూడా ఒక సినిమా చేయనున్నారు. ఇక ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక   బండ్ల గణేష్ తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు దర్శకుడు ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా భయటకు రాలేదు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ నిజమే అయితే బండ్ల గణేష్ మెగా హీరోతో హిట్ కొడతాడా లేదా చూడాలి.

More Related Stories