English   

మహేష్ బాబు అతిథి హీరోయిన్‌కు కొడుకు పుట్టాడోచ్.. 

 RJ Anmol and Amrita Rao
2020-11-03 09:49:57

తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. కానీ ఓ హీరోయిన మాత్రం టైటిల్ కు తగ్గట్లుగానే వచ్చి వెళ్లిపోయింది. అదే అతిథి సినిమా.. అందులో హీరోయిన్ గా నటించిన అమృతా రావు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి అతిథి మాత్రమే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించిన తర్వాత కూడా ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. వచ్చిన వాటిని కొన్ని ఈమె కాదనుకుంది. టాలీవుడ్ లో పరిస్థితులు తనకు సెట్ అవ్వవని చెప్పుకొచ్చింది అమృత. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నవంబర్ 1న ఈమెకు అబ్బాయి పుట్టాడు. 

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దాంతో అమృత, అన్మోల్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఏడేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత 2016లో అమృత, అన్మోల్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఫిబ్రవరిలో తను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది అమృత. ఇప్పుడు అబ్బాయి పుట్టడంతో ఆనందంలో తేలిపోతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మరికొందరు కూడా తల్లి కాబోతున్నారు. ఇప్పటికే విరాట్ భార్య అనుష్క శర్మ, సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ గర్భంతో ఉన్నారు. అంతేకాదు 'చక్ దే ఇండియా'తో గుర్తింపు తెచ్చుకున్న జహీర్ ఖాన్ భార్య సాగరిక కూడా త్వరలో పండంటి బేబీకు జన్మనివ్వనున్నట్టు తెలుస్తుంది. 

More Related Stories