English   

బాహుబలికి బాబు లాంటి సినిమా బాలయ్య అప్పట్లోనే చేసాడు కానీ.. 

Balakrishna
2020-11-03 10:43:29

తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయాలంటే నందమూరి బాలకృష్ణను మించిన హీరో లేడు. ఎన్ని రకాల పాత్రలు చేయాలో అన్నీ చేసాడు.. చేసి చూపించాడు బాలయ్య. పౌరాణిక సాంఘిక జానపద చారిత్రాత్మక సైన్స్ ఫిక్షన్ సినిమాలన్నీ చేసాడు బాలయ్య. అంతటి ట్రాక్ రికార్డు ఉన్న హీరో మరొకరు అయితే లేరు. ఇక్కడ బాలయ్య చేసిన సాహసాలు కూడా ఎవరూ చేయలేదు. మనం అంతా ఇప్పుడు బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దానికి బాబు లాంటి సినిమా అప్పట్లోనే బాలయ్య చేసాడు.. చాలా వరకు పూర్తి చేసాడు. కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల కాలేదు. అసలు విషయం ఏంటంటే.. బాలయ్య కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఈయన భారీ సినిమా ఒకటి చేయాలనుకున్నాడు. దాని పేరు విక్రమసింహ భూపతి. 2001లో నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చిన తర్వాత తన అత్మీయ నిర్మాత భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డితో జానపద విక్రమసింహ భూపతి సినిమా చేయాలనుకున్నాడు. 

తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ ఈ బాధ్యత తీసుకున్నాడు. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేసాడు. రోజా, అంజలా జవేరీ, పూజా భాత్రా హీరోయిన్లుగా ఎంపికయ్యారు. కొందరు చేసిన కుట్రలతో రాజ్యానికి దూరమైన యువరాజుగా ఇందులో బాలయ్య నటించాడు. కుట్రల నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. దీనికి సీనియర్ రైటర్ త్రిపురనేని మహారధి కథ అందించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు. అయితే అంతా బాగానే ఉన్నా కూడా 60 శాతం షూటింగ్ అయిపోయిన తర్వాత విక్రమసింహ భూపతిని ఆపేసారు. ఈ సినిమా కథ కూడా చాలా వరకు బాహుబలినే పోలి ఉంటుంది. 60 శాతం పూర్తైన తర్వాత అనుకోని కారణాలతో షూటింగ్ ఆపేసారు.. సరిగ్గా అప్పుడే నిర్మాత గోపాలరెడ్డి మరణించాడు. దాంతో అసలు ఈ టాపిక్ రాలేదు. 

ఆ తర్వాత కోడి రామకృష్ణ కూడా అడపాదడపా సినిమాలు చేసాడు. ఈ మధ్యే ఈయన కూడా మరణించాడు. దాంతో బాలయ్య  అసలు విక్రమసింహ భూపతి గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఈ సినిమా కానీ విడుదలై ఉంటే బాహుబలి గురించి ఇప్పుడు అంతగా మాట్లాడుకునేవాళ్లే కాదేమో అంటున్నారు నందమూరి అభిమానులు. ఆ రఫ్ షూటింగ్ ఫీడ్ ఇప్పుడు విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు అడుగుతున్నారు. మొన్నటికి మొన్న నర్తనశాల సినిమాను 16 నిమిషాలు అలాగే విడుదల చేసాడు బాలయ్య. 

More Related Stories