English   

గౌతమ్ తో అప్పటి నుండే డేటింగ్..సీక్రెట్స్ భయట పెట్టిన కాజల్

Kajal Aggarwal
2020-11-03 18:26:24

అందాల చందమామ కాజల్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కాజల్ తన ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గౌతమ్ ను ఈ మధ్య కలుసుకుని ప్రేమించలేదని పేర్కొంది. గౌతమ్ ను తాను కలిసి పదేళ్లు అయిందని పేర్కొంది. అందులో ఏడేళ్లు స్నేహం చేశామని...మరో మూడేళ్లు డేటింగ్ లో ఉన్నామని వెల్లడించింది. పదేళ్ల నుండి ఆప్యాయంగా అనురాగంతో ఉన్నామని కానీ సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. అంతే కాకుండా కరోనా సమయంలో తాము మరింత దగ్గరయ్యమని కాజల్ చెప్పుకొచ్చింది. తమ ప్రేమ సినిమాటిక్ రేంజ్ లో జరగలేదని...గౌతమ్ మాటల్లో తన జీవితంలో నాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చెప్పాడు. అప్పుడే గౌతమ్ నాకు జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో అర్థం అయింది. ఆ తరువాతనే ఇద్దరం ప్రేమలో పడ్డాం. దాంతో ఇరు కుటుంబాలను ఒప్పించి జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నాము. కరోనా టైం కావడం వల్ల కొద్ది మంది అతిథుల మధ్యనే మా నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ లా ప్లాన్ చేసుకున్నాం కానీ ఇలాంటి సమయంలో అంత ముఖ్యం అనిపించలేదు అని కాజల్ వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది సినీ పరిశ్రమకు చెందిన వారికి పార్టీ ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.

More Related Stories