English   

రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత

Jeevitha
2020-11-04 14:34:48

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ఉధృతిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరి కొందరు ప్రముఖులు బలయ్యారు. ప్రస్తుతం కొంతమంది నటీనటులు సైతం కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇటీవలే హీరో రాజశేఖర్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జీవిత తో పాటు వారి ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివాని కరోనా ను జయించగా రాజశేఖర్ ఆరోగ్యం విషమించడంతో ఆయన హైదరాబాద్ న్యూరో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రాజశేఖర్ ఆరోగ్యం విషమంగా ఉందటూ ఆయన కుమార్తె శివాని ట్వీట్ చేసింది. ట్వీట్ లో తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించాలని కోరింది. కాగా తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం పై జీవిత స్పందించింది. జీవిత మాట్లాడుతూ..."రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు మేము చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం బాగుపడలని కోరుకున్న అభిమానులందరికి ధన్యవాదాలు" అంటూ జీవిత వెల్లడించింది.

More Related Stories