English   

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత..

Kola Bhaskar
2020-11-04 15:18:12

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన కోలా భాస్కర్ కన్నుమూసాడు. ఈయన వయసు కేవలం 55 సంవత్సరాలు మాత్రమే. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్న కోలా భాస్కర్.. పరిస్థితి చేదాటిపోవడంతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ మధ్య ఆరోగ్యం కుదుటపడ్డట్లే అనిపించినా కూడా మళ్లీ విషమించడంతో నవంబర్ 4 ఉదయం 8 గంటలకు కోలా భాస్కర్ తుది శ్వాస విడిచారు. తెలుగులో ఈయన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ఖుషి.. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన 7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలకు ఎడిటర్‌గా పని చేసాడు. దాంతో పాటు తమిళనాట పొక్కిరి, కేడీ, 3, విల్లు, యుగానికి ఒక్కడు లాంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసాడు ఈయన. సెల్వ రాఘవన్ కు ఈయన మంచి స్నేహితుడు కూడా. ఆయన అన్ని సినిమాలకు ఈయనే ఎడిటర్. అంతేకాదు కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణను కూడా హీరోగా పరిచయం చేసాడు సెల్వ. తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించాడు. కోలా భాస్కర్ మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

More Related Stories