English   

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్.. 

 Arnab Goswami
2020-11-04 15:27:26

కొన్ని రోజులుగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామిపై కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. ఈయనపై కొందరు కత్తులు నూరుతున్నారు. జర్నలిజం ముసుగులో వ్యాపారం చేస్తున్నాడంటూ ఆయనపై కొందరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కూడా. అయితే నవంబర్ 4 ఉదయం ఈయన్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ముంబై అంతా ఒక్కసారిగా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. దేశంలోనే నెంబర్ వన్ జర్నలిస్ట్ అయిన అర్నాబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేసారా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఉదయం సమయంలోనే ముంబైలోని అయన నివాసంలో పోలీసులకు అర్ణబ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వెంటనే అక్కడ్నుంచి ఆయన్ని తీసుకెళ్లారు పోలీసులు. తమ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారని.. తనను ఒక ఉగ్రవాదిలా జుట్టు పట్టుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేసారంటూ అర్నాబ్ గోస్వామి పోలీసులకుపై తీవ్ర ఆరోపణలు చేసాడు. కాగా ఇప్పటివరకు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసారనేది మాత్రం తెలియడం లేదు. ఆ కారణాలు కూడా పోలీసులు చెప్పలేదు. ఓ ఇంటీరియర్ డిజైనర్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ కారణంగానే ఈయన్ని అరెస్ట్ చేసారని తెలుస్తుంది. మరి ఇందులో ఇంకా వేరే కారణాలున్నాయా అనేది త్వరలోనే తేలనుంది. 

More Related Stories