English   

పుట్టిన రోజు నాడు నగ్నంగా పరిగెత్తిన బాలీవుడ్ నటుడు..

Milind Soman
2020-11-04 15:36:19

బర్త్ డే రోజు మహా అయితే చాలా మంది ఏం చేస్తారు.. హాయిగా కుటుంబంతో గడుపుతారు.. లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటారు.. అవన్నీ యిష్టం లేకపోతే గుడికి వెళ్లి దండం పెట్టుకుంటారు.. అదీ కాదంటే అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటారు. అంతేకానీ ఆ రోజే పుట్టాం కదా అని అన్ని విప్పుకుని అయితే తిరగరు కదా.. కానీ ఇప్పుడు ఓ నటుడు ఇదే చేసాడు. అది చూసి అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా తనకు చాలా ఇష్టమైన రన్నింగ్‌ చేస్తూ ఫొటో షేర్ చేసాడు. అది మామూలుగా చేస్తే ఎవడూ పట్టించుకోడు.. కానీ అందులో ఆయనకు బట్టల్లేవు.. మీరు కరెక్టుగానే చదివారు. అప్పుడే పుట్టాను కదా అని నగ్నంగానే ఆయన పరిగెత్తాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఆ ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే టు మీ.. 55 అండ్ రన్నింగ్ అంటూ తనకు తానే విషెస్ చెప్పుకున్నాడు మిలింద్. ఇది చూసి నవ్వుకోవాలో.. ఏడ్వాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ఫోటోలు తీసింది కూడా ఎవరో కాదు మిలింద్  సోమన్ భార్య అంకితా సోమన్. మిలింద్ సోమన్ న్యూడ్ గా సోషల్ మీడియాలో కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. కొన్నేళ్ల కింద టఫ్ షూస్ అనే కమర్షియల్ యాడ్ లో కూడా మాజీ మిస్ ఇండియా మధు సప్రేతో కలిసి న్యూడ్‌గా ఫొటోషూట్ చేసాడు. అప్పట్లోనే ఈయనపై విమర్శలు కూడా వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత పుట్టిన రోజు నాడు ఇదే చేసాడు. అప్పట్లో ఫొటోగ్రాఫర్, పబ్లిషర్ పైన కూడా 14ఏళ్ల పాటు కేసు నమోదైంది. మిలింద్ కెరీర్ విషయానికొస్తే.. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ అయిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్‌లో డా.అమీర్ వర్సీగా చివరగా కనిపించాడు. దాంతో పాటు కొన్ని సినిమాలు కూడా చేసాడు మిలింద్ సోమన్. 

More Related Stories