English   

అమితాబ్ పై కేసు..కారణం ఇదే

 Amitabh Bachchan
2020-11-04 16:48:19

బిగ్ బీ అమితాబచ్చన్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభించి దాదాపు పన్నెండు సీజన్లు గడిచింది. అన్ని సీజన్లు కంప్లీట్ చేసినప్పటికీ షో కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ షో లో అమితాబ్ కొన్ని ప్రశ్నలను అడుగుతారు. ఆ ప్రశ్నలలు సమాధానం చెప్పడాన్ని బట్టి కంటెస్టెంట్ లకు డబ్బులు ఇస్తారు. షో ఆఖరి వరకు ఆడి గెలిచిన వారు మొత్తం కోటి రూపాయలు గెలుచుకుంటారు. షో ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో పాటు విద్యార్థులకు, పెద్దలకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. దాంతో టీవీలు చూడొద్దు అని పిల్లలను హెచ్చరించే తల్లి తండ్రులు సైతం కౌన్ బనేగా కరోడ్ పతి షో చూడాలని చెబుతారు. అందువల్లే ఈ షో మంచి రేటింగ్ తో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో లో అడిగిన ఓ ప్రశ్న కారణంగా అమితాబ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీలను 6 లక్షల 40వేలకు సబందించి ప్రశ్న అడిగారు. 1927లో బి ఆర్ అంబేడ్కర్ అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్నని అడిగారు. అయితే ఈ ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. బిగ్ బీ అడిగిన ప్రశ్న హిందువుల మనోభావాలు కించ పరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.  దాంతో అమితాబ్ బచ్చన్ తో పాటు కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వహకులపై కూడా కేసు నమోదైంది.

More Related Stories