English   

మెగా డాటర్ పెళ్లి డేట్ ఫిక్స్..పెళ్లి అక్కడే

 Niharika
2020-11-04 17:09:32

లాక్ డౌన్ కాలం నుండి టాలీవుడ్ లో పెళ్లి బాజాలు వరుసగా మొగుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్ హీరోలు నితిన్, రానా, నిఖిల్ లు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న నిహారిక-చైతన్య జంట కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. మెగా డాటర్ నిహారిక గుంటూరు ఐజీ గా పనిచేస్తున్న ప్రభాకర్ కుమారుడు చైతన్యతో ప్రేమలో పడింది. దాంతో వారిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆగస్టులో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్ లో జరిగింది. ఇక తాజాగా పెళ్లిని డిసెంబర్ 9న రాత్రి 7:15 నిమిషాలకు రాజస్థాన్ ఉదయపూర్ లోని ఉదయ విలాస్ లో జరిపించనున్నట్టు చైతన్య తండ్రి ప్రకటించారు. దాంతో త్వరలోనే నిహారిక పెళ్లి బాజాలు మొగనున్నాయని క్లారిటీ వచ్చింది. కొద్దిరోజుల నుండి పెళ్లి పనులన్నీ నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ తన చెల్లి పెళ్లిని గ్రాండ్ గా చేయడానికి అన్ని పనులను పక్కన పెట్టి మరీ పెళ్లి పనుల్లో బిజీ అయ్యాడని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా పెళ్లిని హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ నిహారిక కు కాబోయే మామ పెళ్లి తేదీని స్థలాన్ని వెల్లడించి మెగా అభిమానులకు క్లారిటీ ఇచ్చేసారు. ఇక మెగా డాటర్ వివాహం ఉదయ్ పూర్ లో ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి.

More Related Stories