English   

నాకు పెళ్లి కాకపోవడానికి కారణం అతడే..టబు

 Tabu
2020-11-05 17:22:05

నటి టబు కె.రాఘవేంద్రరావు  దర్శకత్యం వహించిన 'కూలి నెంబర్1" చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత తెలుగులోనే కాకుండా   తమిళ, హిందీ, భాషల్లో అగ్ర కథనాయకులతో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. కొన్నేళ్లకు హీరోయిన్ గా సినిమాలకు దూరమయిన ఈ భామ తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. "చెన్నకేషవరెడ్డి" లో సినిమాలో బాలయ్యకి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. "అందరివాడు" సినిమాలో రెండవ హీరోయిన్ గా చిరంజీవి పక్కన నటించి అలరించిరి. ఇక పోయిన సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన "అలా వైకుంటాపురం" సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా నటించి మెప్పించింది. ఇలా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టబు వయసు ప్రస్తుతం (50) కు దగ్గరైంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా పెళ్ళిచేసుకోకుండా ఉండిపోయింది. 

అయితే తాజాగా ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను టబు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నటుడు అజయ్ దేవగన్ అని టబు ఒక బాంబ్ పేల్చింది. "అజయ్ దేవగన్ నాకు 13 సంవత్సరాల వయసునుంచి తెలుసు అతని  సోదరుడు (సమీర్) నాకు  చిన్ననాటి  స్నేహితుడు. వారు  ఇంకొంత మంది స్నేహితులు కలిసి ఒక గ్యాంగ్ మెయింటైన్  చేసేవారు. అజయ్ మరియు అతడి సోదరుడు నాతో ఎవరు మాట్లాడడానికి ప్రయత్నించిన వాళ్ళని కొట్టేవారు. అలా అజయ్ నా సోదరుడినే కాకుండా నన్ను కూడా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆ తరువాత అజయ్ తో చాలా సార్లు నాకు ఒక మంచి అబ్బాయనిి చూడు పెళ్లి చేసుకుంటాను అంటే చిన్నగా నవ్వేవాడు. ఎందుకంటే తనకు  తెలుసు నాను అంత తేలికగా నచ్చరని..ఇలా సరదాగా నాకు పెళ్లి కాకపోవడానికి అజయ్ దేవగన్ కారణమంటూ టబు వెల్లడించింది.

More Related Stories