English   

టాక్ షోతో ఆహా అనిపించనున్న సమంత

Samantha
2020-11-06 12:23:29

అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తరవాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పెళ్లికి ముందు ఎక్కువగా లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటించిన ఈ భామ పెళ్లి తరవాత పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ఇటీవల వచ్చిన ఒబేబీ సినిమా, మజిలీ సినిమాలు కూడా ఆ కోవకు చెందినవే. మరోవైపు మామ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం హిమాలయాస్ కు వెళ్లగా సమంత బిగ్ బాస్ హోస్ట్ గా చేసి సందడి చేసింది. సమంత తమిళ కుట్టి అయినప్పటికీ చైతూ ను పెళ్లి చేసుకుని తెలుగు భాగా వంటపట్టించుకున్నట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ లో హోస్ట్ గా వచ్చిన సమంత తెలుగులో గలగలా మాట్లాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా సమంత వచ్చిన ఎపిసోడ్స్ రేటింగ్ ఎక్కడికో వెళ్లినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు సమంత నేరుగా ఓ టాక్ షోతో ముందుకు వస్తోంది. అల్లు వారి ఓటీటీ యాప్ ఆహా లో సమంత ఒక టాక్ షో చేస్తుంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక ఇన్నిరోజులు సినిమాలతో అలరించిన ఈ అందాల తార యాంకర్ గా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

More Related Stories