English   

రానా కోసం మిహికా ఉపవాస దీక్ష..ఫోటోస్ వైరల్

Rana Daggubati
2020-11-06 12:33:39

కొత్తగా పెళ్లయిన వధూవరులు వారి  దాంపత్య జీవితంకోసం, పిల్ల పాపాలతో  బాగుండాలని ఎన్నో పూజలు చేస్తుంటారు. అదే విదంగా భర్త బాగుకోసం కూడా ఎంతో మంది ఆడపడుచులు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ ఉపవాస దీక్షలకు తెలుగు సాంప్రదాయం లో విశిష్ట ప్రాధాన్యత ఉంది. కార్తీకమాస సమయంలో తెలుగునాట ఉపవాసదీక్షలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి రానా సతీమణి మిహికా బజాజ్ కూడా  భర్త శ్రేయస్సు కోసం ఉపవాస దీక్ష చేపట్టారు. కానీ రానా మిహికలు ఉత్తరాది ట్రెడిషన్లో  ఈ పండగను జరుపుకున్నారు. దానినే "కార్య చౌత్" అని అంటారు. ఇది ఉత్తరాది లో చాలా ప్రాముఖ్యత ఉన్న పండుగ. 

ఈ సందర్భంగా రానా మిహికా దంపతులు కొత్త బట్టలతో సందడి చేశారు. మిహిక మొదటిసారి భర్త కోసం ఈ ఉపవాస దీక్ష చేసింది. ఈ దీక్షకు సంబందించిన ఫోటోలను మిహిక తల్లి సాంఘిక మధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటో లో మిహిక ఎరుపు చీర మ్యాచింగ్ బ్లౌజ్ తో,రానా ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు హ్యాపీ "కార్య చౌత్" దేవుడు ఆశీర్వదించారు. అంటూ అంటూ మిహికా తల్లి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ కాలంలో రానా మిహికల వివాహం అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. ఇటీవలే ఈ జంట హనీమూన్ కు కూడా వెలిచ్చింది. హనీమూన్ కు వెళ్లిన ఫోటోలను మిహికా తన సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.

More Related Stories