English   

చై కి విడాకులు ఇచ్చెయ్..సమంత దిమ్మ తిరిగే సమాధానం

Samantha
2020-11-06 12:39:55

నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తనపై ఎవరైనా మీమ్స్ వేస్తే సమంత తనదైన స్టైల్ లో రీప్లే ఇస్తుంది. అంతేకాకుండా తన ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టిన వారికి సైతం సమంత ఒక రేంజ్ లో రీప్లే ఇస్తుంది. ఇదివరకు సమంత ఫోటోలను పెళ్లి జరగకుందే జరిగినట్టు ఓ నెటీజన్ పోస్ట్ చేయగా సమంత చేసిన కామెంట్ అప్పట్లో తెగ వైరల్ అయింది. తాజాగా మరోసారి సమంత నెటిజన్ కు దిమ్మ తిరిగే రీప్లే ఇచ్చింది. "చై కి విడాకులు ఇచ్చెయ్..మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం" అంటూ కామెంట్ పెట్టగా...సమంత అతడికి రీప్లే ఇస్తూ "కష్టం..ఒక పని చెయ్ చై ని అడుగు" అంటూ చెప్పింది. దాంతో అతడు సరే అడుగుతా అంటూ మరో రీప్లే ఇచ్చాడు. కాగా ప్రస్తుతం సమంత కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటీజన్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చావంటూ పొగుడుతున్నారు. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా తాజాగా బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహా ఓటీటీ లో సమంత టాక్ షో అంటూ మరో ప్రయోగానికి సిద్ధమైంది.

More Related Stories