English   

వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్

 King Nagarjuna
2020-11-06 12:57:46

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రస్తుతం వైల్డ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తిచేయగా మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ షురూ చేశారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా ఉన్న నాగార్జున ఇటు బిగ్ బాస్ షోను అటు వైల్డ్ డాగ్ షూటింగ్ ను కవర్ చేశారు. గతవారం బిగ్ బాస్ కోసం ఆయన చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ వచ్చారు. ఆ తరవాత తిరిగి షూట్ కి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తయిందని. తాను సర్దుకుని ఇంటికి వస్తున్నట్టు నాగార్జున ట్వీట్ చేశారు. తన టీం మేట్స్ ను చాలా మిస్ అవుతున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అహి షోర్ సోలామాన్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో నాగార్జున సరసన దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మరో ముఖ్యపాత్రలో సాయామీ కేర్ నటిస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. నాగ్ కు సహాయకులుగా మరో అయిదుగురు పోలీస్ ఆఫీసర్ లు ఉంటారు. వారిలో ఓ లేడీ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇక ఇన్నిరోజులు మన్మథుడిగా మెప్పించిన నాగ్ ఈ సారి ఓ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

More Related Stories