English   

అప్పుడు ప్రెగ్నెన్సీ తీసుకుని బాధపడ్డా..లాస్య ఎమోషనల్

Lasya
2020-11-06 13:34:39

యాంకర్ లాస్య జీవితం నాణానికి ఒకవైపు మాత్రమే మనకు తెలుసు. కాగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన లాస్య తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. గురువారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు "సమాజం కోసం వేరేవాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల గురించి ఇంటి సభ్యులతో పంచుకోవాలని చెప్పారు" దానిలో భాగంగా లాస్య మాట్లాడుతూ...."2010 లో నేను పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం ఎవరికి తెలియదు. మేము పెళ్లి అయిన తరువాత కూడా వేరు వేరుగానే ఉన్నాం. 2012 నుంచి ఇద్దరం ఒకే చోట కలిసి ఉన్నాం. ఆతరువాత 2014 సంవత్సరంలో ఒక రోజు మానాన్న ఫోన్ చేసి మీరు పెళ్లి చేసుకున్న విషయం మన బందువులలో ఎవరికి తెలియదు. మీరు మీ జీవితాన్ని మంచిగా సెట్ చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే  నేనె మన బంధువుల అందరి ముందు మీ వివాహం చేస్తానని చెప్పాడు. అలా అనడంతో నాకు చాలా సంతోషం వేసింది. 

ఆ తరువాత కొంతకాలానికి నాకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ వెళ్లితే ప్రెగ్నెన్సీ అని చెప్పారు. కానీ జీవితంలో సెట్ కావాలని నాన్న గారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ తీయిచుకున్నాను. ,కానీ ఆ రిపోర్ట్స్ ఇప్పటికి కూడా నా దగ్గరే ఉన్నాయి. ఆ తరువాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో అన్న బాధతో డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఆ తరువాత 2017లో బంధువులందరి ముందు మా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన అయిదు నెలల తరువాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అది మిస్ క్వారీ అయింది. ఆతరువాత 2018 లో జున్నుగాడు నా కడుపులో పడ్డాడు. నాన్న ఈ విషయాలు మీకు కూడా తెలియవు... నన్ను  క్షమించండి" అంటూ లాస్య తన బాధను చెప్పుకుంది.

More Related Stories