English   

పంజాబ్ లో మోగుతున్న ఎన్టీఆర్ సాంగ్

 NTR
2020-11-06 16:37:49

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా జై లవకుశ. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. రాశిఖన్నా, నివేదితా థామస్ లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరింత ప్లస్ గా మారింది. అన్ని హంగులతో జై లవకుశ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా విడుదలయ్యి ఇంత కాలం గడిచినా దేవిశ్రీ అందించిన పాటలు ఎక్కడో ఒక చోట మొగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని "రావణా...జైజైజై" అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. పిల్లల నుండి పెద్దల దాకా అందరి నోటి వెంటా అప్పట్లో ఇదే పాట వినిపించేంది. ఇక తాజాగా పంజాబ్ రోడ్డు పై కొందరు యువకులు ఈ సాంగ్ తో రచ్చ చేశారు. జీప్ లో నుండి రోడ్డు పై ఓ వ్యక్తి రావణుడి గెటప్ లో దిగి అందరిని బయపెట్టాడు. బ్యాక్ గ్రౌండ్ లో "రావణా...జైజైజై" అంటూ సాంగ్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories