English   

హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్న శృతి హాసన్

Shruti Haasan
2020-11-06 16:53:13

హైదరాబాద్ లో అందాల తార శృతిహాసన్ హల్చల్  చేస్తోంది. శృతిహాసన్ ఎక్కువగా ఇష్టపడే  నగరాలలో హైదరాబాద్ ఒకటి. తాను ఏప్పుడు హైదరాబాద్ వచ్చినా నాలుగు గోడల మధ్య ఉండకుండా ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదించడానికే శృతి ప్రాముఖ్యత ఇస్తుంది. అంతే కాకుండా శృతిహాసన్ కి జాగింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మరోసారి చూపించింది శృతి. హైదరాబాద్ లో దిగి దిగగానే నలుపు రంగు టీ షర్ట్,ట్రాక్ ప్యాంట్ మరియు నలుపు షూస్ తో కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ కూడా ధరించి ఈవినింగ్ జాగింగ్ కి బయలు దేరింది. కాగా ప్రస్తుతం ఈ భామ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తన తండ్రి కమల్ హాసన్ పుట్టిన రోజుకు రెండు రోజులముందే అభిమానులు తయారు చేసిన కామన్ డిపిని శృతి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. మరోవైపు శృతిహాసన్ తెలుగు ప్రేక్షకులని అలరించి చాలాకాలమే  అవుతుంది. ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన బలుపు  సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి శృతిహాసన్ అదృష్టం ఏలా ఉందో చూడాలి.

More Related Stories