లోకనాయకుడు కమల్ హాసన్ స్పెషల్ బర్త్ డే ఆర్టికల్..

ఇండియాలో ఉన్న టాప్ యాక్టర్స్ లిస్ట్ వేస్తే అందులో మొదటి ఐదుగురులో ఉంటాడు కమల్ హాసన్. నటన అంటే కమల్.. కమల్ అంటే నటన.. ఒకటి రెండు కాదు.. 61 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఎన్నో అవార్డులు.. మరెన్నో రికార్డులు.. ఇంకెన్నో రివార్డులు.. లెక్కలేనన్ని సన్మా నాలు.. ఇలా రాస్తూ పోతే కమల్ గురించి రామాయణం కంటే పెద్ద గ్రంథమే రాయొచ్చు. అంత గొప్ప నటుడు పుట్టినరోజు నేడు. నవంబర్ 7న ఈయన జన్మించాడు. 1954లో ఈయన జన్మించారు.. ఐదేళ్లకే నటుడిగా పరిచయం అయ్యారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పాలిటిక్స్ లోకి కూడా ఎంటర్ అయ్యారు కమల్ హాసన్. ప్రస్తుతం శభాష్ నాయుడు ఆగిపోయింది.. భారతీయుడు 2 సినిమాకు కమిటయ్యాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా తెరకెక్కించబోతున్నాడు శంకర్.
శంకర్ సినిమా అంటే కచ్చితంగా రెండేళ్లు పడుతుంది కాబట్టే రెండేళ్ల తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తానని చెప్పాడు కమల్ హాసన్. ఇక ఈయన నటన జీవితాన్ని లెక్కేయడం కూడా అంత చిన్న విషయం కాదు. రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ సినిమాల నుంచి మెల్లగా సైడ్ అయిపోవాలని ఫిక్సైపోయాడు. ఈయన కెరీర్ ఆరేళ్ల వయసున్నపుడే మొదలైంది. 1960లో బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు కమల్. ఇక హీరో అయి కూడా మూడు దశాబ్ధాలు దాటిపోయింది. ప్రపంచంలో ఏ నటుడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో సినిమాలకు.. ఎన్నో సంస్థల నుంచి 182 అవార్డులు అందుకున్నాడు లోకనాయకుడు. నటుడిగా ఈయన ఎక్కని మెట్టు అంటూ లేదు. ఇక జాతీయ అవార్డులు, నంది అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులకు కూడా కొదవే లేదు. మొత్తానికి ఇన్నాళ్లూ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆయన నటనలో ఇంకా నేర్చుకుంటూనే ఉంటానని చెబుతున్నాడు కమల్ హాసన్. అలాంటి నటుడు ఇండియాలో మళ్లీ పుట్టడేమో..? అందుకే కమల్ హాసన్ జీ కో సలామ్ అంటారు అంతా.