English   

సౌత్ సినిమాలపై పూజా సంచలన వ్యాఖ్యలు

 Pooja Hegde
2020-11-07 21:18:25

హాట్ బ్యూటీ పూజా హెగ్డే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముకుంద సినిమాలో గ్లామర్ కు అంత ఆస్కారం లేకపోవడంతో అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధుల్ని చేసింది. ఆ తరవాత వచ్చిన సినిమాల్లో ఈ భామ హాట్ అందాలతో మతిపోగొట్టేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ,ప్రభాస్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి.మెప్పించింది. ఇటీవల పూజ హీరోయిన్ గా వచ్చిన "అల వైకుంటాపురం" సినిమాలో బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఈ భామ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

మరోవైపు పూజ బాలీవుడ్ సినిమాలు హౌస్ ఫుల్ 4, మోహంజదారో సినిమాల్లోనూ నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు మాత్రమే చేస్తుంది కానీ మ్యాక్సీమాం సౌత్ లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా పూజ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నట్టు తెలుస్తోంది.   ఫుడ్డు పెట్టే సౌత్ ఇండస్ట్రీ పైనే సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ...సౌత్ సినిమా వాళ్ళు నడుము మత్తులో ఉంటారని వెల్లడించింది. దాంతో ఇప్పుడు ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పూజా చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించి..సౌత్ ఇండస్ట్రీ పైనే కామెంట్స్ చేస్తావా అంటూ ఇండస్ట్రీ వాళ్ళు సైతం బగ్గుమంతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై పూజ ఎలా వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి.

More Related Stories