English   

సామ్ జామ్ కోసం సమంత భారీ రెమ్యునేషన్

 Samantha
2020-11-07 14:25:36

అందాల నటి సమంత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన నటనను ప్రూవ్ చేసుకుంటుంది. ఇప్పటికే మంచి నటిగా గుర్తింపు పొందిన సామ్ పెళ్లి తరవాత మాత్రం గ్లామర్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం నటనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు కొనసాగుతోంది. ఓబేబి, మజిలీ సినిమాల్లో సామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ ఇటీవల మామ నాగార్జున "వైల్డ్ డాగ్" షూటింగ్ కోసం మనాలి వెళ్లిన సందర్భంలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. సామ్ హోస్టింగ్ ఇరగదీసిందంటూ బిగ్ బాస్ అభిమానులు మెచ్చుకున్నారు. 

సమంత తెలుగమ్మాయి కాకపోయినా తెలుగులో గలగలా మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఇక సామ్ అల్లు వారి ఓటీటీ యాప్ ఆహా లో టాక్ షో చేయబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం సామ్ టాక్ షోపై క్లారిటీ వచ్చింది. "సామ్ జామ్" అనే పేరుతో ఈ టాక్ షో రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను విడుదల చేసారు. అయితే ఈ షో కోసం సమంత భారీ పారితోషికాన్ని తీసుకుంటోంది. కేవలం ఒక్క ఎపిసోడ్ కోసం రూ.4 లక్షలు తీలుకుంటున్నట్టు సమాచారం. ఈ షో మొత్తం 30 ఎపిసోడ్స్ చేయాలని ప్లాన్ చేసారట. అంతే మొత్తం ఈ షో ద్వారా సామ్ 1కోటి20 లక్షల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక వెండితెరపై అలరించిన ఈ అమ్మడు ఓటీటీ లో యాంకర్ గా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories