English   

లూసిఫర్ నుండి వినాయక్ ఔట్..కారణం ఇదే

 vinayak
2020-11-07 14:33:24

వి వి వినాయక్ తెలుగు లో మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకడు."ఆది" సినిమాతో వినాయక్ సినిమా పరిశ్రమలోకి దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. ఆ ఒక్క సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ ని  స్టార్ ని చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. "దిల్" సినిమా తో ప్రొడ్యూసర్ రాజు ని "దిల్ రాజు" చేసాడు. ఇంత స్టార్ డమ్ ఉన్న దర్శకుడు ఇప్పుడు మాత్రం కుర్ర దర్శకులతో పోటీపడలేక వరుస పరాజయలతో వెనుకబడి పోయాడు. కానీ మెగాస్టార్ చిరంజీవకిి మాత్రం ఎప్పుడూ వినాయక్ ప్రత్యేకమనే చెప్పవచ్చు. దానికి నిదర్శనం తమిళంలో పెద్ద హిట్ సాధించిన మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన "రమణ" సినిమాని వినాయక్ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. ఆ తరువాత చిరంజీవి పదేళ్ల రీఎంట్రీ కి ఎంత మంది దర్శకులు పడినా "ఖైదీ నెంబర్ 150" సినిమాను చిరు పిలిచి మరీ వినాయక్ కు అప్పగించారు. అయితే ఏప్పటినుండో మలయాళంలో సూపర్ హిట్ అయిన "మహల్ లాల్"  సినిమాను తెలుగులో "లూసిఫార్" పేరుతో రీమేక్ చేస్తున్నారని వార్తలు వసగున్నాయి. ఈ రీమేక్ సినిమాకు వినాయక్ డైరెక్షన్  చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ కు దర్శకత్వం వహిస్తున్నట్టు  వినాయక్ కూడా కొన్ని ఇంటర్వూస్ లో ఒప్పుకున్నాడు. కానీ తాజాగా  వస్తున్న వార్తలు ప్రకారం వినాయక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. క్రేయేటివ్ డిఫరెన్సెస్ వల్లనే వినాయక్ తప్పుకున్నాడని సమాచారం. ఇక వినాయక్ తప్పుకోవడంతో చిరు "లూసిఫర్" భాద్యతలు ఎవరికి అప్పజెపుతారన్నదనిపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

More Related Stories