English   

బాలయ్య సినిమా నుండి ప్రయాగ ఔట్

Balakrishna
2020-11-07 14:39:42

లెజెండ్ బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఇక ఇప్పుడు హైట్రిక్ కొట్టేందుకు మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాను కూడా బోయపాటి మాస్ మాసాల సినిమాగానే తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాను ప్రస్తుతం బిబి3 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా తమిళ యంగ్ హీరోయిన్ ప్రయగా మార్టిన్ ను తీసుకోవాలని బోయపాటి అనుకున్నారు. అంతే కాకుండా ప్రయాగ మార్టిన్ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ చేరుకుని లుక్ టెస్ట్ పూర్తి చేసుకుంది. ప్రయాగ మార్టిన్ తెలుగులో ఇప్పటివరకు సినిమాలు చేయలేదు..కానీ తమిళ్ లో ఈ భామ చాలా సినిమాల్లోనే నటించింది. ధనుష్, దుల్కర్ సాల్మన్ ల సినిమాల్లోనూ ప్రయాగ నటించి అలరించింది. అయితే ఇప్పుడు బాలయ్య సరసన 25 ఏళ్ల ప్రయాగ నటించడం ఏంటి అంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో బోయపాటి యంగ్ హీరోయిన్ ను పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు బాలయ్య కోసం బోయపాటి హాట్ బ్యూటీ అమలా పాల్ ను సంపాదిస్తున్నారని సమాచారం. మరి బాలయ్య సరసన నటించేందుకు అమలా పాల్ ఒకే చెబుతుందా..లేదా? అన్నది చూడాలి.

More Related Stories