English   

బిగ్ బాస్.. ఈ వారం అమ్మ రాజశేఖర్ అవుట్

Bigg Boss Telugu 4
2020-11-07 16:13:15

బిగ్ బాస్ సీజన్-4 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఊహించడం చాలా కష్టంగా మారింది. సీజన్-1,2,3 లలో బయట ప్రేక్షకులు గెస్ చేసిన వాళ్లే ఎలిమినేట్ అయ్యేవారు..కానీ ఈ సీజన్ అందుకు భిన్నంగా ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు జరుగుతోంది. టీవీ9 దేవి ఎలిమినేట్ అయ్యిన వారంలో అంతా మెమెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. అతడి ఓవర్ యాక్షన్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడ్డారు. కానీ చివరికి దేవి ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాక్ కి గురయ్యారు. ఇక కుమార్ సాయి ఎలిమినేట్ అయిన వారంలో ఓటర్లంతా దివి లేదా మోనాల్ ఎలిమినేట్ అవుతారని ఊహించారు. బయట కుమార్ సాయికి మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. అయినప్పటికీ కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అప్పటి నుండి బిగ్ బాస్ ఎలిమినేషన్ పై కూడా ప్రేక్షకులకు అనుమానాలు మొదలయ్యాయి. దాంతో కొంతమంది షో చూడటమే మనేస్తున్నామంటూ కామెంట్లు పెట్టారు. 

కాగా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అమ్మ రాజశేఖర్ కూడా ఉన్నారు. అమ్మా పై హౌస్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దాదాపు అందరితోనూ ఆయనకు గొడవలు ఉన్నాయి. ఇక బయట కూడా అమ్మ రాజశేఖర్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. హౌస్ లో పెద్ద మనిషి అయినప్పటికీ అలా వ్యవహరించడని అతడిపై సీరియస్ అవుతున్నారు. దాంతో ఈ వారం పక్కాగా బయటకు పంపాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమ్మీ హౌస్ నుండి వెళ్లడం ఈ వారం కాయమనిపిస్తుంది. మరి బిగ్ బాస్ పంపిస్తారా..లేదా.. అన్నది చూడాలి.

More Related Stories