English   

విజయ్ తండ్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు

Vijay
2020-11-09 12:51:24

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని ఆయన పేరుతో విజయ్ తండ్రి ఓ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది వివాదాస్పద అంశంగా మారింది. విజయ్ తండ్రి రిజిస్టర్ చేయించిన పార్టీ " విజయ్ మక్కల్ ఇయక్కం" తో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ ప్రకటించారు. అంతే కాకుండా తన అభిమానులెవరూ ఆ పార్టీలో చెరొద్దని ప్రకటించారు. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తన ఫోటోను గానీ.. తన పేరును గానీ పార్టీ జండాలో, కరపత్రాల్లో వాడవద్దని స్పష్టంచేశారు. అయితే విజయ్ చేసిన వ్యాఖ్యలపై అతడి తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని తానే రిజిస్టర్ చేయించానని విజయ్ కి సంబంధం లేదని అన్నారు. విజయ్ కి మొదట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. "విజయ్ మక్కల్ ఇయక్కం" పేరుతో అభిమాన సంఘాన్ని 1993 లో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ అభిమాన సంఘం ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇయ్యకం సభ్యులకు మంచి గుర్తింపు  తెచ్చిపెట్టేందుకే రాజకీయపార్టీగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం విజయ్ చుట్టూ దుష్ట శక్తులు చేరాయని ఆయన అన్నారు. త్వరలోనే ఆ విషయాన్ని విజయ్ గ్రహిస్తారని ఆశిస్తున్నా అన్నారు. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థలు కామన్ అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇక ఇదే విషయంపై శుక్రవారం విజయ తల్లి స్పందించింది. తన భర్త స్థాపించిన పార్టీలో తాను సభ్యురాలిగా లేనని స్పష్టంచేసింది. విజయ్ మరియు అతడి తండ్రి చంద్రశేఖర్ కు మధ్య ప్రస్తుతం మాటలు లేవని పేర్కొంది.

More Related Stories