English   

హీరోయిన్ లక్ష్మీరాయ్ ఇంట విషాదం

Lakshmi Rai death
2020-11-09 13:21:32

నటి లక్ష్మీరాయ్ ఇంట విషాదం నెలకొంది. లక్ష్మీ రాయ్ తండ్రి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన తండ్రిని కాపాడుకోలేకపోయానని లక్ష్మీరాయ్ బాధపడింది. కాపాడుకోలేపోయినందుకు తనను క్షమించాలని తండ్రిని కోరింది. తన తండ్రి గుండె ఆగిపోవడం తనకు ఎంతో భాధ కలిగిస్తోందని వెల్లడించిది. తండ్రిని చాలా మిస్ అవుతున్నానని..ఈ బాధను ఎలా దిగమింగుకోవాలో అర్థం కవడంలేదని పేర్కొంది. తన తండ్రి ప్రేమించినంతగా తనను ఇప్పటివరకూ ఎవరు ప్రేమించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని తెలిపింది. ఈ ఘటన తన జీవితంలో అంధకారాన్ని నింపిందని వెల్లడించింది. పై నుండి తన తండ్రి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారని...తనను ముందుకు నడిపిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది. కాగా లక్ష్మీ రాయ్ తండ్రి మృతి పట్ల ఇండస్ట్రీ కి చెందినవారు...ఆమె అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిరాయ్ ని ధైర్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మీరాయ్ తెలుగు,తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో లారెన్స్ హీరోగా వచ్చిన కాంచన సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా లక్కీ లక్కీ రాయ్... అంటూ ఓ ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేసి కుర్రకారు మతిపోగొట్టింది.

More Related Stories