English   

మరో బిసినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ సోదరి

Manjula Ghattamaneni
2020-11-09 13:27:29

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన పుట్టినరోజు నవంబర్ 8 సందర్భంగా ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతానని అన్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో భయటపెట్టింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా మంజుల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదేంటంటే మంజుల తాజాగా ఆన్లైన్ బిసినెస్ లోకి అడుగు పెట్టింది. "Store. Manjula ghattamaneni" పేరుతో ఓ వెబ్సైట్ ను మరియు యూట్యూబ్ ఛానల్ ను మంజుల స్టార్ట్ చేసింది. ఈ స్టోర్ లో ఆమె నాచురల్ ప్రొడక్ట్స్ అమ్ముతోంది. హెల్తీ లైఫ్ కోసం ఉపయోగపడే ప్రొడక్ట్స్ మరియు అందాన్ని పెంచే వాటిని వెబ్ సైట్ ద్వారా అమ్మనుంది. అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్తీ లైఫ్ స్టైల్ కు సంబంధించి వీడియోలను చేయనుంది. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ మంజుల యుట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలని కోరారు. ఈ వెబ్ సైట్ ఎందరికో మేలు చేస్తోందని ఆయన అభిప్రాయం పడ్డారు. ఇదిలా ఉండగా మంజుల సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా, దర్శకురాలిగా, మరియు నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ బిసినెస్ లోకి అడుగుపెట్టింది. ఈ ఆన్లైన్ బిసినెస్ లో మంజుల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories