English   

రోజా సెల్వమని లవ్ స్టొరీ..ఎన్ని ట్విస్టులున్నాయో

Roja Selvamani
2020-11-09 13:39:01

టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్ లలో రోజా కూడా ఒకరు. రోజా చాలా తకువకాలంలో వందకుపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత తమిళ స్టార్ దర్శకుడు సెల్వమని ని ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా రోజా తన  జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. కాగా రోజా సెల్వమని ల ప్రేమ కథ కూడా ఒక సినిమా స్టోరీలానే ఉంది. ముందుగా సెల్వమని రోజను ప్రేమించడట. ఆ తరవాత ఈవివి సత్యనారాయణ దర్సకత్వంలో "సీతారత్నం గారి అబ్నాయి" సినిమా షూటింగ్ సందర్భంలో సెల్వమని..రోజాకు ప్రపోజ్ చేసాడట. 

అయితే రోజాకు ప్రపోస్ చేసే ముందే సెల్వమని రోజా కుటుంబసభ్యులను ఒప్పించాడట. ఇక కుటుంబ ససభ్యులు ఒప్పుకోవడంతో రోజా నో చెప్పలేకపోయిందట. 1992 లో సెల్వమని ప్రపోజ్ చేస్తే ఇద్దరు కలిసి 2002 లో వివాహం చేసుకున్నారట. అంటే పదేళ్ల తరవాత వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఇద్దరూ అన్యోన్య దంపతులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ప్రస్తుతం సెల్వమని తమిళ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక రోజా అటు టీవీ ప్రోగ్రాంలు ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తోంది. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టుగానే రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐరన్ లెగ్ అనే పేరు నుండి ఇప్పుడు ఐరన్ లేడీ అని పిలిచే స్థాయికి రోజా ఎదిగింది.

More Related Stories