English   

ఆహాలో తమన్నా వెబ్ సిరీస్..టైటిల్ ఇదే

tamannaah
2020-11-09 14:30:33

కరోనా ఎఫెక్ట్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్లకు మూతపడటంతో ఓటీటీలకు భాగా అలవాటు పడ్డారు. దాంతో ఓటీటీలు దర్శకులకు, హీరోయిన్లకు భాగా రెమ్యూనిషన్లు ఇస్తూ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు వెబ్ సీరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తమన్నా కూడా వెబ్ సిరీస్ లో నటించనుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. గారుడవేగ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో తమన్నా నటించనుంది. ఈ వెబ్ సిరీస్ కు "లెవెంత్ అవర్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్టర్ లో తమన్నా లాంగ్ ఫ్రాక్ తో వెనక్కి తిరిగి చూస్తోంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్ గా వస్తోన్నట్టు సమాచారం. 8 పార్ట్స్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నారు.  ఇదిలా ఉండగా తమన్నా ఇటీవలే కరోనా నుండి కోలుకుని తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన సిటీమార్ సినిమాలో తమన్నా నటిస్తుంది. అంతే కాకుండా నితిన్ హీరోగా వస్తోన్న అందాదున్ రీమేక్ లోను ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించనుంది. అలాగే గుర్తుందా శీతాకాలం అనే సినిమాలోనూ తమన్నా నటిస్తుంది.

More Related Stories