English   

అత్తను ఫాలో అవుతున్న సమంత

 Samantha
2020-11-09 17:07:11

అక్కినేని వారి కోడలు సమంత ఇటు వైవాహిక జీవితాన్ని అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. పెళ్లికి ముందు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే అలరించిన ఈ బ్యూటీ పెళ్లి తరవాత మాత్రం ఆచి తూచి అడుగేస్తుంది. ప్రస్తుతం సమంత కేవలం తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లోనే నటిస్తూ అలరిస్తుంది. అంతే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తూ తనలోని మరో కోణాన్ని అవిష్కరిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై మరియు ఓటీటీ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. రీసెంట్ గా నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లడంతో సమంత నాగ్ ప్లేస్ లో హౌస్ లోకి హోస్ట్ గా వచ్చి సందడి చేసింది. 

పట్టు చీరలో వచ్చి సమంత హోస్ట్ గా వ్యవహరించడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సమంత కూడా సగం సగం తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడి ఆకట్టుకుంది. ఇక తాజాగా అల్లువారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో " సామ్ జామ్" అంటూ ఓ టాక్ షో చేయడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు బిసినెస్ లు కూడా చేస్తూ గట్టిగానే సంపాధిస్తోంది. ఇక ఇదిలా ఉండగా సమంతకు ఆవిడ అత్తగారు అమల లాగే జంతువులంటే ఎంతో ప్రేమ. అమల జంతువుల కోసం ఓ చారిటీని కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సమంత ఓ వీధి కుక్కను బుజ్జగిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోకి "చాలా అద్భుతమైన రోజు..వర్క్ సాటిసఫాక్షన్.. మరో రోజు మరో ఛాలెంజ్" అంటూ పేర్కొంది.

More Related Stories