English   

బాలయ్య సరసన అఖిల్ హీరోయిన్

Balakrishna
2020-11-10 12:42:42

ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..బాలయ్య తో హైట్రిక్ కొట్టేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్యకు సూపర్ హిట్స్ అందించిన బోయపాటి ఈసారి కూడా హిట్ ఇచ్చేందుకు కృషిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య పక్కన నటించేందుకు బోయపాటి పలువురు భామలను సంప్రదించారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ నటి పరాగ్య అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం వల్ల ఆమెను తప్పించినట్టు పుకార్లు వచ్చాయి. ఇక ఆ తరవాత హాట్ హీరోయిన్ అమలా పాల్ ను బోయపాటి  సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా ఒకే అవ్వలేదు. 

ఇక ఇప్పుడు తాజాగా బాలయ్యతో రొమాన్స్  చేసేందుకు సయేశా సెహెగల్ రెడీ అవుతోంది. సయేశా "అఖిల్" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని వారసుడు అఖిల్ డెబ్యూ మూవీగా వచ్చిన అఖిల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయినప్పటికి అఖిల్ మొదటి సినిమా కావడంతో సయేశా తెలుగునాట ఒక్క సినిమాతోనే పాపులర్ అయింది. తరవాత సయేశా హిందీ, కన్నడ సినిమాలలో నటించి బిజీ అయిపోయింది. ఇక తమిళ నటుడు ఆర్య ను పెళ్లి చేసుకుని సయేశా సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. కాగా ఇప్పుడు బాలయ్య సినిమాతో సయేశా మళ్ళీ రిఎంట్రీ ఇవ్వబోతోంది. బాలయ్య సరసన ఈ ముద్దుగుమ్మ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories