English   

లుక్ మార్చిన బెల్లంకొండ..సూపర్ అంటున్న ఫ్యాన్స్

 Stylish Bellamkonda
2020-11-10 15:51:11

వి వి వినాయక్ దర్శకత్వం వహించిన "అల్లుడు శీను" సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటివరకు 6 సంవత్సరాలు పూర్తయింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల మేకింగ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలను తన తండ్రి సురేష్ నిర్ముస్తున్నారు. కానీ అంత డబ్బు ఖర్చు చేసినా శ్రీనివాస్ కి మాత్రం పెద్దగా విజయాలు వరించలేదు. ఇక ఇటీవల వచ్చిన "రాక్షసుడు" సినిమా మాత్రం శ్రీనివాస్ కెరీర్లో మంచి సినిమాగా పెరుతెచుకుంది. ఈ సినిమా తమిళ రక్షసన్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఇక "అల్లుడు శీను, జయ జానకి నాయక" సినిమాలు కూడా శ్రీనివాస్ కెరీర్ లో పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇదిలా ఉండగా కారోనా వల్ల షూటింగ్ లు లేకపోవడంతో శ్రీనివాస్ తని జుట్టుని గడ్డాన్ని భారీగా పెంచినట్టు కనిపిస్తోంది. ఇపుడు శ్రీనివాస్ అదే లుక్ లో ఒక ఫోటో షూట్ చేశారు. 

దాంతో అల్లుడుశ్రీను గెటప్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  పొడుగాటి జుట్టుతో గుబురు గడ్డంతో కోరమిసాలతో అదిరిపోయే లుక్ లో బెల్లంకొండ కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ లుక్ కేవలం ఫోటో షూట్ కేనా లేదంటే ఏదైనా సినిమాకోసమా అన్నది చూడాలి. శ్రీనివాస్ తదుపరి చిత్రం "అల్లుడు అదుర్స్"లో నటిస్తున్నాడు. ఈ సినిమాని కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నబ నటేష్, అను ఇమనూయల్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్ లో గొఱ్ఱల సుబ్రమణ్యం ఈ సినిమాకు నిర్మిస్తున్నారు. అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా సాయి శ్రీనివాస్ కి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

More Related Stories