English   

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్

Actor Sunil
2020-11-10 15:58:01

సునీల్ తెలుగులో స్టార్ కమిడియన్ గా దాదాపు పది సంవసరాల పాటు కొనసాగారు. బ్రహ్మానందం తరువాత ఆస్థాయిలో టైమింగ్ ఉన్న కమిడియన్ గా సునీల్ పేరు తెచ్చుకున్నాడు. అయితే కమెడియన్ గా కొనసాగుతున్న  క్రమంలో మంచికో చేడుకో అన్నట్టుగా సునీల్ కి అందాల రాముడు సినిమా లో హీరోగా మొదటి  అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి విజయం కూడా సాధించింది. కాగా రాజమౌళి మగధీర విజయంతో జనాలలో తన  మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చదానికి ఒక చిన్న హీరోతో సినిమా తీయలనే ఉద్దేశంతో సునీల్ తో సినిమా చేసాడు. ఆ సినిమానే "మర్యాద రామన్న". ఈ సినిమా ఆ సంవత్సరానికి టాప్ షేర్లు వసూలు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఆతరువాత సునీల్ చేసిన మరో సినిమా పూలరంగడు కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఎంత ప్రయత్నించినా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు సునీల్.

 దాంతో మళ్ళీ హీరోగా కాకుండా కమిడియన్ ప్రయత్నించినా మునుపటి కామిడి టైమింగ్ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మద్య హీరో, కమిడియన్ గానే కాకుండా డిస్కో రాజా,కలర్ ఫోటో సినిమాలలో విలన్ పాత్రలు కూడా వేసాడు. కలర్ ఫోటో సినిమాలో విలన్ గా మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఏదేమైనా హీరోగా సక్సెస్ అవ్వాలని కోరిక మాత్రం సునీల్ ను ఇంకా విడిచిపెట్టినట్టు లేదు. తాజాగా కన్నడలో విజయం సాధించన 'బేలెబాటమ్' సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. కామెడీ తో పాటు స్పై తరహా కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా లో రిషబ్ శెట్టి, హరి ప్రియ జంటగా నటించారు. ఈ సినిమా తనకి సరిగ్గా  ఉంటుందని సునీల్ భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాతో అయినా సునీల్ హీరోగా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

More Related Stories