English   

క్రిష్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పవర్ స్టార్

 Pawan Kalyan
2020-11-10 16:03:49

డైరెక్టర్ క్రిష్ అనగానే మనకు గుర్తుకువచ్చేవి వైవిధ్యమైన సినిమాలు. అందరు దర్శకుల కంటే భిన్నంగా ఆలోచించే శైలి కలిగిన దర్శకుడు క్రిష్. గమ్యం,వేదం లాంటి సినిమాలతో అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా అభిరుచిని క్రిష్ మార్చేసాడని చెప్పవచ్చు. ఇక ఈరోజు క్రిష్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అయినటువంటి ఏ ఏం రత్నం స్వయంగా క్రిష్ తో కేక్ కట్ చేయంచారు. ఇక తాజాగా జనసేన అధినేత, నటుడు  పవన్ కళ్యాణ్ క్రిష్ కి పుష్ప గుచ్ఛం పంపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. క్రిష్ ప్రస్తుతం 

మెగా మెన్నల్లుడు వైష్ణవ్ తేజ్  హీరోగా... రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా వికారాబాద్ అడవుల్లో జరిగింది. కరోనా, బారి వర్షాలను, తట్టుకొని మరీ ఈ సినిమా షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసారు. దర్శకుడు క్రిష్ త్వరగా సినిమాలు పూర్తి చేయడంలో నేర్పరి కాబట్టి ఈ సినిమాను త్వరగానే పూర్తిచేసి విడుదల చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ని లాంటి సినిమాని క్రిష్  కేవలం 80 రోజులలో పూర్తి చేసి అందరిని ఆశర్యపరిచాడు. ఇక ఏన్టీఆర్ బయోఫిక్ ఫ్లాప్ అవ్వడంతో కొంత వెనకబడిన క్రిష్ మెగా మేనల్లుడి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా..లేదా అన్నది చూడాలి.

More Related Stories