English   

సినీప్రియులకు బంపరాఫర్..మల్టిప్లెక్సుల్లో ఫ్రీ సినిమాలు

YRF
2020-11-10 16:12:49

ఒక చిన్న కరోనా వైరస్ మానవ ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న జనాలకి బ్రేకులు వేసింది. రోడ్లపై తిరిగే జనాలను ఇంటికే పరిమితం చేసింది. దాంతో జంతువులు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి చేరాయి. ఇక ఎప్పుడూ బిజీగా ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్లు సైతం మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో మాల్స్, ఇతర వ్యాపారాలన్నీ తెరుచుకున్నప్పటికి థియేటర్లకు మాత్రం మోక్షం కలగలేదు. అంతే కాకుండా థియేటర్లు తెరిచినా జనాలు వస్తారా లేదా అన్న ప్రశ్న మొదలైంది. 

ఈ నేపథ్యంలో జనాలను థియేటర్లకు రప్పించడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ఒక ఆఫర్ ను ప్రకటించింది. బాలీవుడ్‌లో యశ్‌రాజ్‌ పిలిమ్స్‌కు ఓ ప్రత్యే స్థానముంది. దాదాపు 78 సినిమాలు నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాది 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పీవీఆర్‌ సినిమాస్‌, ఐనాక్స్‌ మూవీస్‌, ఇండియా సినీపొలిస్‌తో సహా పలు మల్టిప్లెక్స్‌లలో ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తమ సూపర్‌ హిట్‌ సినిమాలను ఉచితంగా ప్రదర్శించనుంది. ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పించే వ్యూహంలో భాగంగా యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.వీర్‌ జారా నుంచి సుల్తాన్‌ వరకు అంటే పాత క్లాసిక్‌ నుంచి నేటి సూపర్‌ హిట్‌ మూవీలను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ప్రదర్శించనుంది.

More Related Stories