English   

ఓటీటీల పుణ్యం...మెరుస్తున్న తెలుగు అందాలు

Telugu girls
2020-11-11 13:00:53

కరోనా ఎఫెక్ట్ తో సినీ ఇండస్ట్రీ సీను మారిపోయింది. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ గా ఉండి శుక్రవారం రాగానే థియేటర్లలో జాతకాలు పరీక్షించుకునే రోజులు పోయాయి. లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడటంతో డిజిటల్ మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. లాక్ డౌన్ తో జనాలు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ లకు అడిక్ట్ అయ్యారు. దాంతో ఓటీటీలు కూడా కంటెంట్ ను పెంచడానికి పోటీ పడుతున్నాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇప్పినుండో ఉన్నపటికీ లాక్ డౌన్ తోనే వాటి క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త యాప్ లు కూడా పుట్టుకొచ్చాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆహా అనే ఓ ఓటీటీ యాప్ ను ప్రారంభించారు. 

అయితే సినిమాలను కొనడం తమ యాప్ లో ప్రదర్శించడం నిర్వాహకులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోటీ కూడా బాగానే పెరిగింది. దాంతో ఓటీటీ ల యాజమాన్యాలు తామే నిర్మాతలుగా మారి చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను చిత్రీకరించి తమ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. దాంతో ప్రాంతీయ తరాలకు డిమాండ్ పెరిగిందనే చెప్పవచ్చు. ఇక ఈ నిర్ణయంతో షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ సినిమాల్లో నటించిన భామలకు ఓటీటీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. దాంతో వారికి సంపాదన కూడా పెరుగుతోంది. ఇక సైడ్ క్యారెక్టర్లు చేసుకునే కంటే ఓటీటీలో పెద్ద వెబ్ సిరీస్ లలో నటించడం మెలనుకుంటున్నారు. అలా ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకున్న తెలుగు భామల్లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం, పూజిత పొన్నాడ, ఇటీవలే కలర్ ఫోటో సినిమాతో హిట్ అందుకున్న చాందినీ చౌదరీలు ఉన్నారు.

More Related Stories