English   

గమనం ట్రైలర్ రిలీజ్ చేసిన పవర్ స్టార్

 Pawan Kalyan
2020-11-11 13:06:58

డైరెక్టర్ సుజనారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "గమనం". ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో నిత్యామీనన్, శ్రీయ, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం విడుదల చేసారు. అనంతరం చిత్ర యూనిట్ కలిసి ట్రైలర్ ను చూశారు. ఈ సినిమాను మూడు విభిన్న కథల ఆధారంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సినిమాలో నిత్యామీనన్ కర్ణాటకట గాయకురాలు శైలపుత్రి దేవి పాత్రలో నటిస్తోంది. శ్రీయ శరన్ ఓ చంటి బిడ్డ కలిగి చెవుడు ఉన్న యువతిగా నటిస్తోంది.  అంతే కాకుండా క్రికెటర్ కావాలనుకునే ఓ యువకుడిని ప్రేమించే ముస్లిం యువతి కథ ఆధారంగా మరో ఉండబోతుంది. ఈ సినిమా ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ లను ఐదుగురు ప్రముఖులు విడుదల చేసారు. హిందీ ట్రైలర్ ను సోనూసూద్, తమిళ్ లో జయం రవి,  కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళం లో ఫహాద్ ఫసీల్ విడుదల చేసారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.

More Related Stories