English   

ఓటీటీల్లో రికార్డులు బద్దలు కొట్టిన అక్షయ్ లక్ష్మీ

Akshay Kumar
2020-11-11 14:01:30

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచన సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు రీమేక్ గా హిందీలో "లక్ష్మీ" పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా...కియార అధ్వానీ హీరోయిన్ గా నటించారు. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో విడుదల చేసారు. హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా  ఓ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఓటీటీ లలో విడుదలైన అన్ని సినిమాల కంటే ఎక్కువ వ్యూవ్స్ లక్ష్మీ సినిమాకు వచ్చాయి. దాంతో అక్షయ్ కుమార్ ఓటీటీ స్టార్ గా మారారు. ఇక ఇదివరకు ఈ రికార్డు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సొంతం చేసుకున్నారు. సుశాంత్ నటించిన దిల్ బెచారా సినిమా 24 గంటల్లో ఎక్కువ వ్యూవ్స్ సాధించగా ఇప్పుడు ఆ రికార్డును అక్షయ్ "లక్ష్మీ" బ్రేక్ చేసింది. అక్షయ్ సినిమా అత్యతిక వ్యూవ్స్ సంపాదించిన విషయాన్ని హాట్ స్టార్ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వ్యూవ్స్ ఎక్కువగా రావడం విశేషం. ఇక ఇప్పటివరకు వసూళ్ల పరంగా రికార్డులు అంచనా వేసుకున్న హీరోలు ఇప్పడు తమ సినిమాకు ఓటీటీల్లో వచ్చిన వ్యూవ్స్ ని బట్టి అంచనా వేసుకుంటున్నారు.

More Related Stories