English   

జక్కన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై వర్మ ఆసక్తికర ట్వీట్

 Rajamouli
2020-11-11 15:28:33

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా..లేదా ఏదైనా అంశం పై స్పందించినా అతడి రూటే సేపరేటు అన్న చందంగా ఉంటుంది. ఏడాదికి ఒకటి రెండుసినిమాలు తీసే వర్మ ఓటీటీ పుణ్యమా అని షార్ట్ ఫిలిమ్స్ తీసినట్టు సినిమాలు తీస్తూ ఓటీటీల్లో వదులుతున్నాడు. ఇక ఇతర ఓటీటీ యాప్ లు కూడా వర్మ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపకపోవడంతో సొంత ఓటీటీ ఒకటి ఏర్పాటు చేసుకుని మరీ సినిమాలు తీస్తున్నాడు. వాటిలో బూతు సినిమాలతో పాటు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా చేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఇక మరోవైపు వర్మ తీసిన "మర్డర్, దిశ" సినిమాలు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి.

ఇక తాజాగా వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అదేంటంటే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో రాంచరణ్ మొక్కలు నాటి "ఆర్ఆర్ఆర్" టీమ్ కు ఛాలెంజ్ విసిరారు. దాంతో దర్శకధీరుడు రాజమౌళి తన టీం తో కలిసి ఈరోజు మొక్కలు నాటారు. ఆ ఫోటోలను జక్కన్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాజమౌళి ఈ ఛాలెంజ్ ను వర్మ, పూరి జగన్నాథ్, వివి వినాయక్ లకు విసిరారు. కాగా రాజమౌళి చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేసిన వర్మ " రాజమౌళి సార్ నేను పచ్చదనం కానీ ఇలాంటి ఛాలెంజ్ లు కానీ చేయలేదు. నాకు మట్టి పట్టుకోవడం అంటేనే నచ్చదు. మొక్కలు నాటడానికి నా లాంటి సెల్ఫిష్ పర్సన్ పనికి రాడు. మీరు..మీ మొక్కలు బాగుండాలి" అంటూ వర్మ ట్వీట్ చేసాడు. దాంతో వర్మ ట్వీట్ కు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. వర్మతో అంత వీజీ కాదని అంటున్నారు.

More Related Stories