English   

క్యూట్ మనవడితో బాలయ్య..ఫొటోస్ వైరల్

Balayya
2020-11-11 18:05:03

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బాలయ్య కాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడుపుతురానే సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య  తన మనవడు ఆర్యవీర్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో బాలయ్య తమ మనవడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే బాలయ్య మనవడు కూడా తాత అందానికి ఎక్కడా తక్కువ కాలేదు క్యూట్ లుక్కుతో నెటిజన్లను తనవైపు తిప్పుకున్నాడు. ఫొటోలో మల్టికలర్ కుర్తా ధరించి ఉన్నాడు. ఇక బాలయ్య తాత వయసు వచ్చినప్పటికి చూడటానికి మాత్రం 40ఏళ్ళ వయసు లానే కనిపిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ ఇటీవలే తన డైరెక్షన్ లో వచ్చిన నార్థనశాల సినిమాను థియేటర్లలో విడుదల చేసారు. 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో దివంగత నటులు సౌందర్య, శ్రీహరి లు ఉండటంతో ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా చూసారు. ఇక ప్రస్తుతం బాలయ్య  బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బీబీ3 లో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. దాంతో ముచ్చటగా మూడో హిట్ కొట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను వెతకడం కోసం బోయపాటి తెగ కష్టపడుతున్నాడు. హీరోయిన్ కోసం ఇప్పటివరకు పలువురు భామలతో స్క్రీన్ టెస్ట్ జరిపిన బోయపాటి ఆఖరికి అఖిల్ సినిమా హీరోయిన్ 23 ఏళ్ళ సయేశా సెహేంగల్ ను ఖరారు చేసారు. అయితే బాలయ్య పక్కన పతికేళ్ళు కూడా లేని హీరోయినా అంటూ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వస్తున్న ట్రోల్స్ తో హీరోయిన్ ను మారుస్తారా..లేదంటే ఏం పట్టించుకోకుండా సినిమా తీస్తారా చూడాలి.

More Related Stories